దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించి రాష్ట్రంలో అధికార పార్టీ పనితీరుపై ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు ఈ క్రమంలో రాళ్లదాడికి పాల్పడ్డారు.. అంతేకాదు షర్మిల క్యారవాన్‌కు నిప్పు పెట్టడంతో పరిస్థితి రణరంగంగా మారింది.
వైఎస్సార్‌టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగించిన పాదయాత్ర అడుగడుగునా ఆంటంకాలు ఏర్పడ్డాయి. నర్సంపేట ఎమ్మెల్యేపై ఆమె చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.. ఆమెను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో అదనపు బలగాలను తెప్పించే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలించారు. దీంతో ఆమె కొనసాగిస్తున్న 223 వ రోజు పాదయాత్రకు బ్రేక్ పడినట్లయ్యింది.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. తాను ఇప్పటి వరకు చేసిన పాదయాత్రలో ఎప్పుడూ ఇలాంటి దారుణమైన పరిస్థితి కనబడలేదని.. ప్రజల పక్షాన నిలబడి అధికార పార్టీ పరిపాలనపై ప్రశ్నించినందుకు గుండాల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని.. ఆ ఆదరణ చూడలేకనే అధికార పార్టీ అక్కసు వెల్లబోస్తుందని అన్నారు.
కొంతమంది అధికార పార్టీకి చెందినవారు రౌడీలు, గుండాల్లా ప్రవర్తిస్తూ తమ వాహనాలకు నిప్పు పెట్టిన వీడియోలు ఉన్నాయని చూపించినా.. వాళ్లను అరెస్ట్ చేయకుండా తనను అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడవేశారని.. ఆ సందర్భంగా తనకు గాయాలు కూడా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. లా అండ్ ఆర్డర్ సాకు చూపించి తన పాదయాత్రను అడ్డుకున్నారని.. తన పాదయాత్ర ఆగబోదని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టిఆర్ఎస్ పార్టీలో ఉన్నది నాయకులు కాదు గుండాలు – షర్మిలమ్మ pic.twitter.com/HgcCskvqIN
— 𝐘𝐒𝐑𝐓𝐏 (@YSSR2023) November 28, 2022