వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్నని కుట్ర చేసి చంపినట్లే నన్నుకూడా చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు అన్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన షర్మిల ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. నేను పులి బిడ్డనని, నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలని ఆమె సవాల్ విసిరారు. నేను బతికున్నంత కాలం ప్రజల నుంచి నన్ను వేరు చేయడం ఎవరి తరం కాదని అన్నారు.
నన్ను ఒంటరిగా ఎదరుకోలేక.., నన్ను ఎన్నో రకాలుగా హింసిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. నేను టీఆర్ఎస్ ప్రభుత్వ అవినితిపై మాట్లాడుతుంటే నాపై కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు. మీతో పోలీసులు ఉంటే.., నాతో ప్రజలున్నారని వైఎస్ షర్మిల అన్నారు. అయితే గత కొన్ని రోజల నుంచి వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. వారి వ్యాఖ్యలకు షర్మిల సైతం ధీటుగా కౌంటర్ లు వేస్తుండడం విశేషం. తాజాగా షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.