మంగళవారం వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఆమె కిందపడింది.
మంగళవారం వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకు ముందే షర్మిలను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఆమె బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ టీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆమె కిందపడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రి వెళ్లేందుకు యత్నించిన వైఎస్ షర్మిలను పోలీసులు ఆమె ఇంటి గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని పోలీసులను షర్మిల కోరారు. తన వాహనంలో కాకున్నా మీ వాహనంలో తీసుకెళ్లినా పర్వాలేదని పోలీసులను విజ్ఞప్తి చేశారు. తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరామర్శిస్తానని షర్మిల స్పష్టం చేశారు. అనుమతి లేదంటూ అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు.
అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఉస్మానియా ఆస్పత్రిలో రేకుల షెడ్డులో వైద్యం చేస్తున్నారని, రూ.200కోట్లతో ఉస్మానియా హెల్త్ టవర్స్ కడతామని సీఎం కేసీఆర్ గాలి మాటలు చెప్పారని ఆమె ఆరోపించారు. తనను గృహ నిర్బంధం చేయడంపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఏం అధికారం ఉందని హౌజ్ అరెస్టు చేస్తారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్ బిడ్డకు కేసీఅర్ భయపడుతున్నాడని సెటైర్లు వేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనతా రైడ్ కి పిలుపు ఇచ్చామని షర్మిల తెలిపారు. మరి.. వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.