తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడాలని కోరుకుంటారు. వారి భవిష్యత్తుకోసం కృషి చేస్తుంటారు. ప్రయోజకులైన తమ పిల్లలకు వివాహాలు చేసి బాధ్యతలు నెరవేర్చుకోవాలని అనుకుంటారు. ఇదే విధంగా ఓ తల్లిదండ్రులు తమ కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న వారికి ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో వారు నిర్ఘాంతపోయారు.

నేటి యువత ఆలోచనా విధానాల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. యువతీ యువకులు ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడిన తరువాతే వివాహాలు చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం పెళ్లైన తరువాత జరుగుతున్న గొడవలు చూసి అసలు పెళ్లే వద్దు బాబోయ్ అనే ఆలోచనలో పడిపోయారు. పెళ్లితో బంధం ఏర్పడటంతో పాటు బాధ్యతలు కూడా మీద పడుతాయి. వైవాహిక జీవితంలో ఎన్నో కష్టసుఖాలు అనుభవించాల్సి ఉంటుంది. ఇవన్నీ భరించలేననుకున్న ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది.
నగరంలోని మూసాపేటలో నివసిస్తున్న ఝాన్సీ అనే 25ఏళ్ల వయసున్న యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. పెళ్లీడుకొచ్చిన ఝాన్సీకి వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కానీ ఝాన్సీ మాత్రం తనకు పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులకు ఖరాకండిగా చెప్పింది. దీనికి గల కారణం ఇరుగు పొరుగు ఇళ్లల్లో భార్యభర్తల మధ్య చోటుచేసుకుంటున్న కొట్లాటలు చూసి పెళ్లిపై విరక్తి, భయం పెంచుకుంది. అయినా ఝాన్సీ కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి సంబంధాలు చూడటం ఆపలేదు. దీంతో తనకు ఎక్కడ పెళ్లి చేస్తారోనని భయపడిన ఝాన్సీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి చేసి పంపాలనుకున్న తల్లిదండ్రులు తమ కూతురు ఇలా విగత జీవిగా మారడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.