ప్రజలకు రక్షణగా ఉంటూ సమాజంలో జరిగే నేరాలను, ఘోరాలను అరికట్టడం పోలీసుల బాధ్యత. ఎంతో మంది పోలీసులు నిజాయితీగా తమ విధులు నిర్వహిస్తూ ప్రజలకు గుండెల్లో హీరోలా నిలిచిపోతుంటారు. కానీ కొందరు మాత్రం సామాన్యులను వేధిస్తూ.. అందిన కాడికి డబ్బులు గుంజుకుంటారు. పోలీసులు లంచం కోసం పీడిస్తారని చాలా మంది ఆరోపణలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఎస్సై వేధిస్తున్నాడంటూ సెల్పీ సూసైడ్ వీడియో తీశాడు.
ప్రజలకు రక్షణగా ఉంటూ సమాజంలో జరిగే నేరాలను, ఘోరాలను అరికట్టడం పోలీసుల బాధ్యత. ఎంతో మంది పోలీసులు నిజాయితీ తమ విధులు నిర్వహిస్తూ ప్రజలకు గుండెల్లో హీరోలా నిలిచిపోతుంటారు. అయితే మరికొందరు సెటిల్ మెంట్స్, ఇతర అవినీతి కార్యక్రమాలు చేస్తూ పోలీస్ శాఖకు అపకీర్తి తెస్తుంటారు. గొడవలతో తమ వద్దకు వచ్చిన వారికి రాజీ చేసి డబ్బులు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక వివిధ సమస్యలతో తమ వద్దకు వచ్చిన వారిని డబ్బుల కోసం పీడిస్తారని పలువురు విమర్శిస్తుంటారు. ఎంతో బాధితులు పోలీసులపై ఆరోపణలు చేస్తూ వీడియోలు కూడా చేశారు. తాజాగా తన భార్యా పిల్లలను ఎస్సై దూరం చేశాడంటూ ఓ వ్యక్తి సెల్పీ తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రాంతి కుమార్ అనే యువకుడు సెల్పీ సూసైడ్ యత్నం చేశాడు. జిల్లా సీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్ఐ బాబూరావు వేధింపులు భరించలేకపోతున్నా అంటూ క్రాంతి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్యాభర్తల మధ్య విబేధాలు సృష్టించి.. తన భార్యను.. ఎస్సై ఇంటికి తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యా పిల్లలను తన నుంచి దూరం చేశాడని క్రాంతి కన్నీటి పర్యంతమయ్యాడు. రూ. 7లక్షల నగదు, ముడున్నర తులాల బంగారం తీసుకుని ఎస్ఐ బాబూరావు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సూసైడ్ యత్నం చేశాడు. ఎస్ఐ బాబురావు అన్న కూతురినే క్రాంతి పెళ్లి చేసుకోగా.. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలు నెలకొన్నాయి.
వారి సమస్యల్లో ఎస్సై బాబూరావు మధ్యవర్తిత్వం చేస్తుండటంతో విషయం ముదిరిందని క్రాంతి ఆరోపిస్తున్నాడు. నిజామాబాద్ లోని న్యాల్ కల్ రోడ్డులో ఓ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అంతకంటే ముందు డయల్ 100 కు పోన్ చేసి అసలు విషయం చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న క్రాంతిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడకు చెందిన క్రాంతికుమార్ నిజామాబాద్ లోని గాయత్రినగర్ లో ఉంటున్నాడు. ప్రస్తుతం క్రాంతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.