టెక్నాలజీ రంగంలో మనిషి ఎన్నో విజయాలు అందుకుంటున్నాడు. భూమి, సముద్రం, ఆకాశం అన్నింటా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా.. మూఢ నమ్మకాలను ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికీ పలు చోట్ల క్షుద్రపూజల కలకలం రేపుతూనే ఉన్నాయి.
టెక్నాజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ.. ప్రజలు ఇంకా మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. మంత్రాలు, మూఢనమ్మకాలు .. క్షుద్ర పూజలు ప్రజల్ని వనికిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మాయలు.. మంత్రాలు అంటూ ప్రజలను కొంతమంది బురిడీ బాబాలు మోసం చేస్తూనే ఉన్నారు. శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా జిగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. శ్మశానవాటికలో శవాలను దహనం చేసిన బూడిద పూసుకొని నగ్నంగా ఓ యువకుడు చేసిన పని తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఓ యువకుడు శ్మశాన వాటికలో మృతదేహాలను దహనం చేసిన బూడిది పూసుకొని ఒంటిమీద నూలు పోగు లేకుండా గట్టిగా అరుస్తూ.. రాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతూ స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. గుర్తు తెలియని ఆ యువకుడు గత కొన్ని రోజులుగా పట్టణంలోని మోతే శ్మశాన చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. యువకుడు నగ్నంగా మారి శ్మశానంలో శవాలను కాల్చిన తర్వాత బూడిద తన ఒంటికి పూసుకొని తనలో తాను మాట్లాడుకూంటూ.. అప్పడప్పుడు కేకలు వేస్తూ తిరుగుతున్నాడని అంటున్నారు. ఆ యువకుడిని కొంతమంది వాహనదారులు సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఆ యువకుడి కి సంబంధించిన వీడియో, ఫోటోలు చూసి పోలీసులకు చేరవేశారు. ఆ యువకుడు ఎవరు.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అన్న వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. స్థానికులు ఆ యువకుడు తాంత్రిక విద్యలు నేర్చుకుంటున్నాడని.. క్షుద్రపూజలు చేసేవాడని అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని గుస గుసలాడుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగాలంటే భయపడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అతన్ని వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.