పది రూపాయలు దొరికితే మూడో కంటికి తెలియకుండా జేబులో వేసుకుంటారు. ఇక కట్టల కట్టలు డబ్బులు, బంగారం నిండిన బ్యాగ్ దొరికితే ఎవరైనా ఏం చేస్తారు. ఇంకా చెప్పాలంటే బంగారం బ్యాగులో అడ్రస్ కూడా లేకుండా దొరికితే మూడో వ్యక్తికి తెలియకుండా ఠక్కున తీసుకుని అక్కడి నుంచి జారుకుండటారు. కానీ ఓ వ్యక్తి చేసిన పనికి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పది రూపాయలు దొరికితే మూడో కంటికి తెలియకుండా జేబులో వేసుకుంటారు. ఇక కట్టల కట్టలు డబ్బులు, బంగారం నిండిన బ్యాగ్ దొరికితే ఎవరైనా ఏం చేస్తారు?. ఇంకా చెప్పాలంటే బంగారం బ్యాగులో అడ్రస్ కూడా లేకుండా దొరికితే మూడో వ్యక్తికి తెలియకుండా ఠక్కున తీసుకుని అక్కడి నుంచి జారుకుండటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అలా చేయలేదు.. తనకు దొరికిన బంగారాన్ని ఇంటికి తీసుకెళ్లలేదు. ఎంతో నిజాయితీగా.. నిబద్ధతతో పోలీస్ స్టేషన్ లో అప్పగించి.. అందరి ప్రశంసలు అందుకున్నాడు. మనుషుల్లో మానవత్వం, నిజాయితీ ఇంకా ఉందని ఈ ఘటన నిరూపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని పటాన్ చెరువు ప్రాంతంలో బీరంగూడెం కమాన్ దగ్గర ఉన్న సాయి భగవాన్ కాలనీలో నివాసం నిరూప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తన తమ్ముడి నిశ్చితార్ధం విజయవాడలో ఉంటే వెళ్లి.. తిరిగి బస్సులో హైదరాబాద్ వచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన బంగారం ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్నాడు. అలానే ఇంటికి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో బీరంగూడ సమీపంలోని ఆటో స్టాండ్ దగ్గర బంగారం ఉన్న బ్యాగ్ ను నరేందర్ అనే వ్యక్తి గుర్తించాడు.
దానిని తీసుకుని తెరిచి చూడగా అందులో నగలు ఉన్నాయి. అందులోని నగలు చూసి నరేంద్ర కాసేపు షాకి గురయ్యాడు. ఆ బ్యాగ్ లో ఎటువంటి అడ్రస్ కూడా లేదు. అయితే పరుల సొమ్ము తీసుకోవడం పాపమని నరేందర్ భావించాడు. నరేందర్ నిజాయితీతో ఆ నగల బ్యాగ్ ను స్థానిక పోలీస్ స్టేషన్ అప్పగించాడు. బ్యాగ్ ను తీసుకున్న సీఐ సంజయ్ కుమార్ విచారణ చేసి.. బాధితుడు నిరూప్ ను గుర్తించాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి పిలిచి.. నగలు ఉన్న బ్యాగ్ ను నిరూప్ కి అప్పగించారు. ఎంతో నిజాయితీతో రూ.25 లక్షల విలువైన బ్యాగ్ ను అప్పగించిన నరేందర్ ను పోలీసులు సన్మానించారు.
తన నగల బ్యాగ్ ను ఎంతో నిజాయితీతో అప్పగించిన నరేందర్ కు బాధితుడు నిరూప్ కృతజ్ణతలు తెలిపారు. ఈ ఘటన తెలిసిన చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని.. మనుషుల్లో చాలా మంది మంచోళ్లు ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనుషులందు మంచి మనుషులు వేరయా.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.