దేశ వ్యాప్తంగా రోజుకు ఎంతో మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరుకు అందరూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. అయితే తాజాగా మరో యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు.
ఈ మధ్యకాలంలో చాలా మంది గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలతో ప్రజలను భయందోళనలకు గురువుతున్నారు. ఇకపోతే దేశ వ్యాప్తంగా రోజుకు ఎంతో మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన తోటి స్నేహితులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫలితం లేకపోవడంతో అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు.
స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా మర్రిపూడి ప్రాంతానికి చెందిన మణికంఠ (27) అనే యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతడు నగరంలోని KPHBలో నివాసం ఉండేవాడు. అయితే వారంతం కావడంతో మణికంఠ శనివారం తన స్నేహితుల ద్వారా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామంలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. మణికంఠ ముందుగా ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు. అప్పటికే అతనికి వెన్ను నొప్పిగా ఉండడంతో రెస్ట్ తీసుకోవడానికి కారులో వెళ్లి కూర్చున్నాడు. ఇక కూర్చున్న చోటే అతడు స్పృహ లేకుండా పడిపోయాడు.
స్నేహితులు వెంటనే స్పందించి హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వరుస గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.