ఆ జంట ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. అయితే ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించిన యువకుడిని పెళ్లాడిన యువతి అత్తారింట్లో కాపురం పెట్టింది. తమను ఎదిరించి పెళ్లి చేసుకున్నారన్న అక్కసుతో ఉన్న యువతి తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే ప్రేమికుడి ఇంటికి వెళ్లి వారిని చితకబాగా యువతిని ఎత్తుకువెళ్లారు తల్లిదండ్రుల. కాగా, యువతి కిడ్నాప్ స్థానికంగా ఎంతో కలకలం రేపింది.
జగిత్యాల జిల్లా బాలపల్లికి చెందిన జక్కుల మధు, ఇటిక్యాలకు చెందిన అక్షర కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఇక తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోరని నిర్ణయానికి వచ్చిన మధు, అక్షర నాలుగు నెలల క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే యువకుడి తల్లిదండ్రులను ఎలాగో అలా ఒప్పించడంతో అక్షర అత్తగారి ఇంటి వద్ద ఉంటుంది. తమ కూతురికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని భావించిన అక్షర తల్లిదండ్రులు ఆమెను ఎలాగైన ఇంటికి తీసుకు వెళ్లాలని భావించారు.
ఈ క్రమంలో రెండు కార్లలలో బాలపల్లికి చేరుకొని కత్తులు,గొడ్డళ్లతో మధు కుటుంబ సభ్యులపై దాడి చేసి అక్షరను బలవంతంగా ఎత్తుకు వెళ్లారు. తన భార్యను ఆమె తల్లిదండ్రులు ఎత్తుకు వెళ్లిన విషయం తెలుసుకున్న మధు వెంటనే జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో లేని సమయంలో కుటుంబ సభ్యులను బెదిరించి తన భార్య అక్షరను ఎత్తుకు వెళ్లారని మధు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మధు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అలక్షర తండ్రి, మేనమా మరికొంతమందిపై కేసు నమోదు చేశారు.