అందరి లక్ష్యం బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించడం. అలానే చక్కగా చదువుకుని ఐటీ రంగంలో ఐదెంకల జీతం సాధిస్తే.. ఎవరైనా ఏమి చేస్తారు. చక్కగా ఏసీ గదుల్లో కూర్చోని ల్యాప్ టాప్ పై వర్క్ చేస్తూ కాలం గడిపేస్తారు. నెల జీతం రాగానే వాటితో ఎంజాయి చేస్తుంటారు. ఇది సాధారాణంగా ఈ తరం యువతలో చాలా మంది చేసే పని. కానీ ఓ యువతి వ్యవసాయం పై ఉన్న మక్కువతో ఐదెంకల జీతాన్ని తృణపాయం వదులుకుంది. ల్యాప్ టాప్ పై నర్తించిన ఆమె చేతి వేళ్ళకు కలుపు మొక్కలను ఏరే పని చెప్పింది. సేద్యానికి ఆధునికతను జోడించి తన వ్యవసాయ క్షేత్రాన్నే ప్రయోగశాలగా మార్చింది. ఆమె అదిలాబాద్ కు జిల్లాకి చెందిన ఏనుగు సాయి చిన్మయి.
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన ఏనుగు మోహన్ రెడ్డి, సుజాత దంపతుల కూతురు సాయి చిన్మయి. ఇంజనీరింగ్ చదివిన చిన్మయికి చిన్నప్పటి నుంచి వ్యవసాయానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి ఎక్కువ. అయినా అందరిలా హైదరాబాద్ లో ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పనిచేసేది. నగరంలోని యాంత్రిక జీవితం తనకు నచ్చలేదు. ఎప్పుడు ఊరిపైనే ధ్యాసంత. కరోనా నేపథ్యంలో పని చేస్తున్న సంస్థ వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి బాట పట్టింది. సేద్యం మీద మక్కువతో తమ ఊరి శివారులోని వ్యవసాయ కేత్రంలో సాగు పనులను చూసుకుంటున్న తల్లిదండ్రులకు అండగా ఉండాలని భావించింది. మొదట్లో ఆమె అభిప్రాయాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు.. అర్థం చేసుకుని చిన్మయిని ప్రోత్సహించారు. వారి సపోర్టుతో వ్యవసాయంలోకి దిగిన చిన్మయి.. సేద్యానికి ఆధునికతను జోడించి తమ వ్యవసాయ క్షేత్రాన్నే ప్రయోగశాలగా మార్చింది.
చిన్మయి మార్కెట్ ను అధ్యయనం చేసి, అన్ని కాలాల్లో గిరాకీ ఉండే పంటలను పండిస్తోంది. మామిటి తోటలో చెట్ల మధ్యలో ఉండే ఖాలీ స్థలంలో పలు రకాల ఇతర పండ్లు, పూల మొక్కలను సాగు చేస్తోంది. పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తుంది. మరొక వైపు కోళ్ళు, కుందేళ్ళు, బాతుల వంటి వాటి పెంపకం కూడా చేపట్టింది. రానున్న రోజుల్లో మరికొన్ని ఇతర పెంపుడు జీవాలను పోషించాలనేది ఆమె ఆకాంక్ష అంటా. వ్యసాయం అంటే చిన్న చూపు చూసి.. సాఫ్ట్ వేర్ అంటే గొప్పలాగా భావిస్తున్న యువత ఉన్న ఈ కాలంలో పట్టణం నుంచి పల్లెకు వచ్చి తన విన్నుత్న సేద్యంతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువ మహిళ రైతు. మరి.. ఈ యువ రైతు చిన్మయి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.