తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయం త్వరలో ప్రారంభం కానుంది. యాదాద్రీశుడి స్వయంభువుల దర్శన భాగ్యం భక్తులకు త్వరలో కలగనుంది. ప్రధానాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా మహాకుంభ సంప్రోక్షణ మార్చి 28న ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం మేరకు ముందస్తు పనులు ప్రారంభించారు.
ఈ నెల 28న ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహకుంభ సంప్రోక్షణతో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఈ నెల 21 నుంచి 7 రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహించనున్నారు. “మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 21 నుంచి 28 వరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తరలిస్తారు.
అన్ని పూజలు పూర్తయిన తర్వాతే భక్తులకు దర్శనాలకు అనుమతి ఉంటుంది. ఇక కొండ కింద నిర్మించిన దీక్షాపరుల మండపంలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తాం. కల్యాణ కట్ట, పుష్కరిణిలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడుకి జియో ట్యాగింగ్ చేస్తాము. దీనివల్ల ప్రతిరోజూ ఎంతమంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు అన్నది పక్కాగా తెలుస్తుంది. భక్తుల రద్దీని బట్టి నియంత్రణ చర్యలు తీసుకుంటాం” అని ఆలయ ఈవో గీత తెలిపారు.
మరోవైపు యాదాద్రి పుణ్యక్షేత్రం భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తం 300 మంది పోలీస్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఉద్ఘాటన గడువు దగ్గర పడుతుండడంతో కొండపై పనులు చకచకా సాగుతున్నాయి.ప్రధానాలయం ముందు బంగారు వన్నెతో కూడిన క్యూ కాంప్లెక్స్ పనులు పూర్తి చేస్తున్నారు. కొండపైన గల మరో ప్రధానాలయమైన శివాలయం పనులు దాదాపు పూర్తి చేశారు.మరి..యాదాద్రి ఆలయ విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.