టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ప్రగతిభవన్ నుంచి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. నొప్పితోనే ఆయన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. కాలికి గాయమై ఇబ్బంది పడుతున్న మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఇదే సమయంలో విశ్రాంతి సమయంలో ఓటీటీలో మంచి షోలు వుంటే చెప్పాలన్న కేటీఆర్‌పై ఆమె సెటైర్లు వేశారు.
కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోలు చూడటానికి సలహా ఇస్తారా? అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Had a fall today & ended up tearing my ankle ligament. Been advised 3 weeks of rest 🙁
Any advise on binge worthy OTT shows? pic.twitter.com/sWat7eCkWX
— KTR (@KTRTRS) July 23, 2022
ఈ విషయంపై స్పందించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. ‘కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించడమే కాకూండా.. మీ కోసం మంచి సినిమాలు ఉన్నాయి.. ఇవి ఎంతో వినోదాన్ని పంచుతాయంటూ.. కుట్ర సిద్ధాంతం, క్లౌడ్ బరెస్ట్, నీట మునిగిన ఇళ్లు, పంప్‌హౌస్‌లు’ వున్నాయని ట్వీట్ చేశారు. ప్రస్తుతం.. ఈ సెటైరికల్ ట్వీట్ తెగ వైరలవుతోంది. ‘అక్కా .. ఇవన్నీ నువ్ ముందే చూశావా..’ అని నెటిజన్స్ వైఎస్ షర్మిలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ సెటైరికల్ ట్వీట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Get well soon @KTRTRS
Shows to watch for your pleasure:
Conspiracy Theory: the Cloud Burst,
&
Submerged Homes and Pump Houses https://t.co/pNuMhe4ujr— YS Sharmila (@realyssharmila) July 23, 2022
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాదీ యువతి రికార్డ్.. రూ. 2.7 కోట్ల స్కాలర్ షిప్ కు ఎంపిక
ఇది కూడా చదవండి: KCR New Convoy: సీఎం కేసీఆర్ వాహన శ్రేణికి కొత్త ఫిట్టింగ్స్.. అదీ గుట్టుచప్పుడు కాకుండా!