అతడు చేసిన పనితో మహిళ భయాందోళనకు గురైంది. అతడు అక్కడినుంచి పరుగులు తీయగానే.. గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టింది. అటుగా వెళుతున్న సునీత రెడ్డి ఆమె అరుపులు విన్నారు.
ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్స్ ఎక్కువయ్యారు. కేవలం పట్టణాలు, నగరాలు మాత్రమే కాదు.. పల్లెల్లో కూడా చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఒంటిమీద అభరణాలు దోచుకుపోతున్నారు. ఎక్కువగా ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేస్తున్నారు. కొందరు ప్రయాణ వాహనాల డ్రైవర్లు కూడా దోపిడీలకు దిగుతున్నారు. తాజాగా, ఓ ఆటో డ్రైవర్ మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కొని పోయాడు. అటుగా వెళుతున్న తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఛైర్మన్ ఆ మహిళకు సహాయం చేశారు.
దొంగను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లికి చెందిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ఓ మహిళా ప్రయాణికురాలిని ఎక్కించుకొని నర్సాపూర్ వైపు వెళ్తున్నాడు. ఆటో బీవీఆర్ఐటీ కళాశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి రాగానే రోడ్డు పక్కకు ఆపాడు. ఆ వెంటనే ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి పుస్తెలతాడును లాక్కున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో మహిళ కేకలు వేయటం మొదలుపెట్టింది.
అటుగా వెళుతున్న తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఛైర్మన్ సునీతారెడ్డి ఆ మహిళ అరుపులు వింది. వెంటనే కారును ఆపి విషయం తెలుసుకుంది. తన సహాయకులను ఆటో డ్రైవర్‌ను పట్టుకురావాలని పంపింది. వెంటనే వారు ఆటోను చేజ్ చేసి డ్రైవర్‌ను పట్టుకువచ్చారు. అతడి వద్దనుంచి పుస్తెలతాడును తీసుకుని బాధితురాలికి ఇచ్చేశారు. ఆటో డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు. మరి, సదరు మహిళకు సహాయం చేసిన తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఛైర్మన్ సునీతారెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.