అర్థరాత్రి.. ఉమెన్స్ కాలేజ్.. పైగా అమ్మాయిలు. ఎన్నో ఆశలతో కన్నవాళ్లను కాదని చదువుకోసం విద్యార్థులు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అలా అర్థరాత్రి విద్యార్థినులు హాస్టల్‌లో నిద్రిస్తున్న క్రమంలో గత కొన్ని రోజుల నుంచి వింత శబ్దాలు, వికృత రూపాలు కనిపిస్తున్నాయంటూ విద్యార్థినిలు హడలిపోతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది. వీరిని అంతగా భయపెడుతున్న ఆ వికృత రూపాల వెనకున్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అది మహబూబాబాద్‌లోని ఓ డిగ్రీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్. ఇక్కడ ఎంతో మంది అమ్మాయులు చదువుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి వింత శబ్దాలు రావడంతో విద్యార్థినులు తీవ్ర భయందోళనలకు గురవుతున్నారు. అర్థరాత్రి పూట హాస్టల్ లోకి దెయ్యాలు వస్తున్నాయంటూ అంతా వారి వారి ఇంటికి వెళ్లిపోతున్నారు.
దీనిపై వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సెమిస్టర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలోనే అమ్మాయిలు ఇలా చేస్తున్నారంటూ కళాశాల సిబ్బంది భావిస్తున్నారు. అసలు విద్యార్థులు నిజంగానే పరీక్షలకు భయపడి ఇలా చేస్తున్నారా? లేదంటే మరేదైన కారణం ఉందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.