సాధారణంగా చాలా మంది యాత్రలకు వెళ్లే సమయంలో వాహనాలను ఇంటిగా మార్చుకుని ఉపయోగిస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం కారునే ఇంటిగా మార్చుకుని.. రెండేళ్లుగా అందులో ఒంటరిగా నివాసముటోంది. స్థానికులు అందించిన ఆహారం తింటూ జీవనం సాగిస్తోంది. మరి.. ఆ మహిళ ఎవరు., ఆమె ఎందుకు కారునే నివాసంగా మార్చుకుని అందులో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ లోని మధురానగర్ లోని మెయిన్ రోడ్డులో రెండేళ్లుగా ఓ మహిళ మారుతీ ఓమ్ని కారు(AP31Q6434)లో నివాసం ఉంటుంది. ఆ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు మహిళతో మాట్లాడారు. ఆమె.. తన పేరు గుర్రం అనిత(30) అని మాత్రమే చెప్పింది. దీంతో ఇతర వివరాలకోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందన విషయం మాత్రం తెలియరాలేదు. అనిత స్థానికంగా ఉన్న ఓ హాస్టల్ లో ఉండేది. ఫీజు చెల్లించకపోవడంతో రెండేళ్ల క్రితం సదరు హస్టల్ నిర్వహకులు ఆమెను ఖాళీ చేయించారు. దీంతో సామాగ్రి తీసుకుని అప్పటి నుంచి కారులోనే నివాసం ఉంటుంది.
కారునే ఇంటి గా మార్చుకుని ఉంటూ స్థానికులు ఇచ్చే ఆహారం తింటూ కాలం గడుపుతోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ కారు ఆమె పేరుతోనే రిజిస్టరై ఉంది. కారును రోడ్డుపై నిలిపి ఉంచినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమాన కూడా విధించారు. పోలీసులు సదరు మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలా కారులో ఉండటం ప్రమాదకరమని, స్టేట్ హోం కి తరలించి ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. అయితే అందుకు అనిత అంగీకరించలేదు. అయినా ఆమెకి మరోసారి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.