Wine Shops: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. హైదరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగా వైన్ షాపులపై ప్రభుత్వం నిషేదం విధించింది. దీంతో ఆదివారం, సోమవారం వైన్ షాపులు పూర్తిగా బంద్ కానున్నాయి. మంగళవారం యథావిథిగా షాపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బోనాల నేపథ్యంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.