సినిమాలకి, రాజకీయాలకి విడదీయరాని అనుబంధం ఉంది. హీరోలు ఆయా పార్టీలకు మద్దతు తెలపడం.. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం చేయడం చూస్తున్నాం. తాజాగా అల్లు అర్జున్ కూడా ఓ ప్రముఖ రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమాలకి, రాజకీయాలకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు. ఈనాటి అనుబంధం ఏనాటిదో అనేలా ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు, రాజకీయాలు కలిసిపోయాయి. అవి రెండు వేరు వేరు కాదు అని మరోసారి రుజువైంది. తాజాగా అల్లు అర్జున్ ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయడానికి సిద్దమయ్యాడనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఆ రాజకీయ పార్టీ అయితే అల్లు అర్జున్ తమకు ప్రచారం చేయబోతున్నాడనే వార్తతో ఫుల్ ఖుషిలో ఉంది. అల్లు అర్జున్.. తెలుగు సినిమాలో ఉన్న అగ్ర నటుల్లో ఒకరు. అభిమానులందరూ ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. స్టైలిష్ స్టార్ దగ్గర నుంచి ఐకాన్ స్టార్ దాకా ఎదిగిన అల్లు అర్జున్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.
అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు తమ పనులను పోస్ట్ పోన్ చేసుకొని మరి మూవీకి వెళ్తారు. తన మాతృభాషలోనే కాకుండా కేరళలో కూడా లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఏకైక ఇండియన్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి పేరు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఒకసారి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందక ముందు ఉన్న టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎలక్షన్స్ లోనే అల్లు అర్జున్ తన మావయ్య తరపున ప్రచారం చేస్తారని అందరూ భావించారు. కానీ ప్రచారం చేయలేదు.
ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వేడి మొదలయ్యింది. వచ్చే డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ మావయ్య చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చంద్ర శేఖర్ రెడ్డిని గెలిపించడానికి అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని.. అందుకు అల్లు అర్జున్ ఒప్పుకున్నాడని చంద్ర శేఖర్ రెడ్డి సన్నిహితులు, బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే కనుక జరిగితే తమ పార్టీకి కూడా చాలా ఉపయోగం అని బీఆర్ఎస్ పెద్దలు అంటున్నారు. మరి అల్లు అర్జున్ తన మావయ్య చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించడం కోసం తగ్గేదేలే అని ప్రచారం చేస్తారేమో చూడాలి.