Telangana: రాష్ట్రంలో వరుస పేపర్ లీకులు సంచలనంగా మారాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. మరి ఈ స్థాయిలో లీకులు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
వరుస పేపర్ లీకులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటివల టీఎస్పీఎస్సీలో గ్రూప్-1 పేపర్ లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. లక్షల మంది నిరుద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. విద్యార్థి నాయకుల ధర్నాలు, ప్రతిపక్ష పార్టీల నిరసనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఆధ్వర్యంలో పేపర్ లీక్‌పై విచారణ జరుపుతోంది. ఇప్పటికే చాలా మందిని సిట్ అదుపులోకి తీసుకుంది. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఈ పేపర్ లీక్ వివాదం ఇంకా చల్లారకముందే.. సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో తొలి రోజు తెలుగు పేపర్ సోషల్ మీడియాలో పంపిణీ అయింది. విద్యార్థులంతా పరీక్షా హాల్‌లో కూర్చున్న తర్వాత.. సరిగ్గా పరీక్ష మొదలైన సమయంలో.. ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది.
దీంతో.. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా అలజడి మొదలైంది. తాండూరులోని ఓ పరీక్ష కేంద్రంలో టీచర్ వాట్సాప్‌లో పేపర్‌ను పెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీతో పాటు ఇప్పుడు టెన్త్ పేపర్లు కూడా లీక్ అవుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను, విద్యాశాఖ ఉన్నాతాధికారులను అప్రమత్తం చేసింది. అయినా కూడా రెండో రోజు హిందీ ప్రశ్నాపత్రం సైతం.. సరిగ్గా ఉదయం పరీక్ష ప్రారంభం అయ్యే సమయం 9.30 నిమిషాలకు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. సోమవారం అంత జరిగినా.. సస్పెన్షన్లు, అరెస్టులు జరిగినా.. మళ్లీ రెండో రోజు కూడా పేపర్ లీక్ కావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ఈ లీకులు నిజంగానే ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్నాయా? లేక ఈ లీకుల వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అనే విషయాలపై సామన్య ప్రజల్లో సైతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీకు ఒక ఉద్యోగి వల్ల జరిగిందని ప్రాథమికంగా తేలింది. ఒక అమ్మాయి కోసం, అలాగే డబ్బుకు ఆశపడి.. ఓ ఉద్యోగి చేసిన పని వల్ల కొన్ని లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి కంప్యూటర్‌కు మేమే బాధ్యులమా అని మంత్రులు దబాయించినా.. గ్రూప్ 1 లాంటి ఉన్నత ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ప్రక్రియలో అవకతవకలు జరిగితే.. ఎవరు అవునన్నా, కాదన్నా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. అయితే.. గ్రూప్ 1 పేపర్ లీక్ వెనుక కొంతమంది ఉద్యోగులు, డబ్బు ఉందనే విషయం బయటపడటంతో ప్రభుత్వంపై విమర్శలు తగ్గాయి. కానీ.. ఆ వెంటనే పదో తరగతి ప్రశ్నాపత్రాలు సైతం పరీక్ష ప్రారంభం కాగానే.. సోషల్ మీడియాలో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది.
టెన్త్ ప్రశ్నాపత్రాల వెనుక ఎలాంటి డబ్బు కోణం లేదనే విషయం తెలుస్తోంది. అందుకు కారణం.. విద్యార్థులంతా పరీక్షా హాలులో కూర్చున్న తర్వాత.. వారికి పంచేందుకు సీల్ ఓపెన్ చేసి అప్పుడు వాటిని ఫొటోలు తీసి.. వాట్సాప్‌లో పోస్టు చేస్తున్నారు. దీని వల్ల అక్రమాలకు పాల్పడే వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది? అనేదే ప్రధాన ప్రశ్న. దీని వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పదో తరగతి పేపర్ లీకులు చేయిస్తున్నారనే అనుమానం బలంగా వ్యక్తం అవుతుంది. పలు అభివృద్ధి కొలమానాల్లో తెలంగాణ, దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. దాదాపు చాలా రాష్ట్రాల్లో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయి.
ఇలా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఎదుర్కొవాలంటే.. అభివృద్ధి, సంక్షేమం విషయంలో సాధ్యం కావడం లేదు కనుకే.. ఇలా పేపర్ లీకులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిష్టతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందనే చర్చ ప్రస్తుతం ప్రజక్షేత్రంలో జరుగుతోంది. పైగా తెలంగాణాలో విద్యార్థుల పవర్ ఏంటో దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ విద్యార్థులదే కీలకపాత్ర. అలాంటి విద్యార్థి వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చ గలిగితే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని కొంతమంది భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
అందుకే నిరుద్యోగులు, విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరీక్షలను అడ్డం పెట్టుకుని, వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారనే అనుమానం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా విద్యార్థులంతా పరీక్ష హాలులోకి చేరుకున్నాకా? పేపర్‌ను లీక్ చేస్తే.. అలా చేసిన వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. తెలుగు పేపర్ లీకైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటినా అన్ని చర్చలు తీసుకున్నా.. రెండో రోజు మళ్లీ పేపర్ లీక్ చేసేంత ధైర్యం వచ్చిందంటే.. దాని వెనుక కచ్చితంగా ఒక బలమైన మోటివ్, లేదా కుట్ర ఉందని మేధావి వర్గం సైతం అనుమానం వ్యక్తం చేస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Youth Congress leaders who questioned the government on paper leak, were sent to remand custody for 7 days
The KCR government arrested and jailed the Youth Congress leaders who protested in front of the SSC board over the leaked 10th class paper today.#ReleaseShivaSenaReddy pic.twitter.com/wpKCrYSlmz— Telangana Youth Congress (@IYCTelangana) April 3, 2023