తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజూకీ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఎండల దెబ్బకు జనాలు అల్లాడుతున్నారు. ఇక మూగ జీవాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు.ఈ సారి ఉష్ణోగ్రతలు గతేడాది కంటే పెరిగాయి. దీంతో ఇప్పుడే ఈ స్థాయిలో ఎండలు అదరగొడుతుంటే.. రానున్న రానున్న రేపటి నుంచి ఎండలతో పాటు తీవ్రమైన వడగాలులు కూడా వీస్తాయని వాతారవరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఎండలు ఉండనున్నాయి. ఈ నాలుగు రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతారవరణశాఖ తెలిపింది.
దీంతో ప్రజలు తగిన జగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకి వెళ్లవద్దని సూచించింది. ఈ మేరకు ఆరెండ్ అలెర్ట్ ను జారీ చేసింది.అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణా సీఎస్ సోమేశ్ కుమార్.. జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.
అన్ని ఆసుపత్రుల్లో సరిపడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. వేసవి తాపం, వడగాల్పుల వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ లో పని సమయాన్ని తగ్గిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉపాధి కూలీలు పనులు చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాదు.. అగ్నిమాపక శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.