పోలీసులంటే.. సమాజంలో నేరాలు చోటు చేసుకోకుండా.. కాపాడాల్సిన బాధ్యత వారిది. కానీ ఈ మధ్య కాలంలో.. నేరాలు జరగకుండా చూడాల్సిన పోలీసులే.. పదవిని, అధికారాన్ని అడ్డుపెట్టకుని.. రకరకాల నేరాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి.ఈ క్రమంలో తాజాగా ఓ సంఘటన వెలుగు చూసింది. నేరస్తులకు సింహస్వప్నంగా ఉంటూ.. సామాన్యులకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు.. ఇద్దరు హద్దులు మీరి ప్రవర్తించారు. ఇద్దరు వివాహేతర బంధం కొనసాగించారు. వీరి బంధం గురించి మహిళా ఎస్సై భర్తకు తెలిసింది. దీని గురించి ఆమెను వారించాడు. కానీ మాట వినలేదు. దాంతో.. విసిగిపోయి.. భార్య వ్యవహారం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఉన్నతాధికారులు సదరు సీఐ, మహిళ ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. ఆ వివరాలు..
ఈ సంఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఆర్. వెంకటేశ్వర్లు, దామెర పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పని చేస్తున్న ఏ. హరిప్రియ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా.. వివాహేతర సంబంధం కొనసాగుతోంది. దీని గురించి హరిప్రియ భర్త.. మహిళను వారించాడు. కానీ ఆమె భర్త మాట వినలేదు. దాంతో.. హరిప్రియ వ్యవహారం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్.. సీఐ, మహిళా ఎస్సైతో పాటు.. సుబేదారి ఎస్ఐ పున్నం చందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
యువతి లైంగిక వ్యవహారం ఘటనలో.. మరో సుబేదారి ఎస్ఐ పున్నం చందర్‌ను వరంగల్ కమిషనర్ సస్పెండ్ చేశాడు. సుబేదారిలో నివాసం వుంటున్న ఓ యువతి గత కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు గురవుతోంది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి కాపాడమని.. కోరుతూ స్టేషన్‌ను ఆశ్రయించింది. అయితే.. ఆ ఠాణాలో ఎస్ఐగా ఉన్న పున్నం చందర్ మాత్రం.. నిందితుడిపై కేసు నమోదు చేయకుండా రాజీపడాల్సిందిగా బాధితురాలిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దాంతో ఆమె.. ఉన్నతాధికాలకు ఫిర్యాదు చేయడంతో.. వరంగల్ కమిషనర్.. పున్నం చందర్‌ను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశాడు. మరి మిగతావాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు.. ఇలాంటి వ్యవహారలు నేరపడం ఎంత వరకు సమంజసం.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.