ఐపీఎల్‌లో జరిగే ముఖ్య సంఘటనలను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ ప్రచారానికి ఒక రేంజ్‌లో వాడుకుంటున్నారు. తాజాగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాని కోహ్లీ ఒక నిర్వేదపు నవ్వు నవ్వాడు. దీన్ని కూడా సజ్జనార్ వాడుకుని.. ఆర్టీసీలో బస్ పాస్ మర్చిపోయి.. కండక్టర్‌కు దొరికిపోయే వారిపై సెటైరికల్‌గా ఒక పోస్టు చేశారు. ప్రస్తుతం సజ్జనార్ ట్వీట్టర్‌లో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
‘కండక్టర్ వచ్చి పాస్ అడిగినప్పుడు, బస్ పాస్ ఇంట్లో మర్చిపోయిన మన రియాక్షన్..’ అంటూ దానికి ట్యాగ్ లైన్ జోడించారు. మీరు ఎప్పుడైనా పాస్ మర్చిపోయి బస్ ఎక్కారా?.. అలాంటి సందర్భాన్ని పంచుకోవాలని సజ్జనార్ నెటిజన్లకు కోరారు. అలాగే సోమవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ తీసి.. గ్రౌండ్‌లో మోచేతిపై పడుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు. దాన్ని కూడా ‘అమ్మ బస్సులో సీట్ ఆపమన్నప్పుడు ఇలా’ అంటూ.. చాహల్ ఫొటోను పోస్టు చేశారు. ‘కారులో కంఫర్ట్ ఉంటుంది.. బస్సులో జ్ఞాపకాలు ఉంటాయి’ అంటూ దానికి క్యాప్షన్ జోడించారు. ఇలా ఐపీఎల్‌లోని హైలెట్ అవుతున్న వాటిని ఆర్టీసీ ప్రచారానికి వాడుకుని ఆకర్షిస్తున్నారు సజ్జనార్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RTC ప్రయాణికులకు MD సజ్జనార్ బంపరాఫర్
Share your experiences with us#RCBvsLSG #ViratKohli𓃵 #Virat #IPL20222 #CricketTwitter pic.twitter.com/5J92QzFFtT
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 20, 2022
కారులో కంఫర్ట్ ఉండొచ్చు కానీ బస్సులో జ్ఞాపకాలు ఉంటాయి.#RRvKKR #chahal #IPL2022 #BCCI #TATAIPL @ICCLiveCoverage pic.twitter.com/PP9dhbqhpy
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.