ఈ మద్య కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.. మద్యం సేవించి వాహనాలు నడపడం… ఇలా కారణాలు ఏవైనా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మద్య కొంత మంది మైనర్లు సైతం రోడ్లపైకి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఈ తప్పిదాలు జరగకుండా చూడాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
తాజాగా సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర సంఘటన ఎదురైంది. పాత బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ బాలుడు బైక్ నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల కంట పడ్డాడు. స్కూటీపై బ్యాగులు వేసుకొని పాఠశాల నుంచి ఇంటికి దర్జాగా వెళ్తూ కనిపించాడు. వెంటనే ఆ బాలున్ని అధికారులు ఆపి నువ్వు స్టూడెంట్ కదా.. మరి స్కూటీ వేసుకొని ఎక్కడకు వెళ్తున్నావు అని ప్రశ్నించారు. ఇక ఆ బాలుడు చెప్పిన సమాధానం విన్న ట్రాఫిక్ పోలీసులు ఖంగు తిన్నారు. తాను రోజూ బండి మీదే స్కూల్కు వెళ్తానని.. ఈ బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదు కాబట్టి మీరు ఆపకూడదని బదులిచ్చాడు. అంతే కాదు తన తండ్రి ఎంపీటీసీ.. నన్నే ఆపుతారా అంటూ ఎదురు ప్రశ్నించాడు.
ఇది చదవండి : విషాదం: ట్యాంకర్ నుంచి కెమికల్స్ లీక్! ఆరుగురు మృతి
ఇక ఆ బాలుడు వేసిన ప్రశ్నలకు ట్రాఫిక్ పోలీసుల అవాక్కయ్యారు.. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ఏ చట్టంలో కూడా లైసెన్స్ లేకుండా బండి నడపాలని లేదని.. మరోసారి రిపీట్ అయితే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. తర్వాత బాలుని బంధువులను పిలిపించి స్కూటీని అప్పగించి పంపించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం ఎంత వరకు న్యాయం.. ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలిజయేయండి.