రాజకీయ నేతలు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు కోకొల్లలు. కొన్ని రోజుల క్రితం ఏపీలో ఇలాంటి సంఘటనలు రెండు చోటు చేసుకోగా.. తాజాగా తెలంగాణలో కూడా వెలుగు చూసింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు సీఐని ఏయ్ నువ్వేంది ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు హల్చల్ చేశారు. ఏయ్.. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూ సీఐపై ఫైర్ అయ్యారు. విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, తనని, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి ఉన్న ఫోటోలు పోస్ట్ చేయడం పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గాను వీహెచ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
ఆ సమయంలో ఆయనకు, సీఐకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వీహెచ్.. సీఐపై ఫైర్ అయ్యారు. ఏయ్ ఎంది నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్.. ఇదే మీడియా వస్తే ఇలానే చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. గొడవ సద్దుమణిగిన తర్వాత వీహెచ్ మార్ఫింగ్ చేసిన ఫొటోలను సీఐకి చూపించి, తన ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.