ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పట్టుమని పదేళ్ల వయసు లేని చిన్నారులు సైతం గుండెపోటు కారణంగా మృతి చెందడం కలవర పెడుతోంది. ఇక తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి సభ్యులు ఒకరు గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఆ వివరాలు..
ఈ ఏడాది ప్రారంభం నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక టాలీవుడ్‌లో అయితే ప్రతి నెల ఎవరో ఒకరు ప్రముఖుడు కన్ను మూయడం చోటు చేసుకుంటుంది. ఇక శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు మృతి చెందారు. గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. జీవన్ రెడ్డి వయసు 50 ఏళ్లు.
కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డి దంపతుల కుమారుడు జీవన్ రెడ్డి. మేనల్లుడి మృతితో కిషన్‌రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కిషన్ రెడ్డి అక్కాబావ కుటుంబం సైదాబాద్ వినయ్ నగర్‌లో నివాసం ఉంటోంది. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్నప్పుడే జీవన్ రెడ్డి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
జీవన్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు అతన్ని వెంటనే కాంచన్‌బాగ్‌లోని డీఆర్డిఎల్ వద్ద ఉన్న అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే జీవన్ రెడ్డి మృతి చెందాడు. శనివారం ఉదయం జీవన్ రెడ్డి అంత్యక్రియలు జరుతాయని కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. గురువారం నొయిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఢిల్లీలో ఉండగా ఈ దుర్వార్త తెలిసింది. వెంటనే ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.
అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెపోటు కారణంగానే మృతి చెందుతున్నారు. నందమూరి తారకరత్న కూడా తీవ్రమైన గుండెపోటు వచ్చి కుప్ప కూలాడు. ఆయనను ఆస్పత్రికి తలరించి.. 23 రోజుల పాటు చికిత్స అందించినా లాభం లేకపోయింది. చివరకు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న మృతి చెందారు. నిన్న కూడా హైదరాబాద్ పాతబస్తిలోని కాలాపత్తార్‌లో ఓ వివాహ వేడుకకు హజరైన వ్యక్తి.. వరుడికి పసుపు రాస్తు ఉన్నట్లుండి కుప్పకూలి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు.. ప్రాణాలు విడుస్తున్నారు.