నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాల్లో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయసు 25నుంచి 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా..? అన్న దానిపై పోలీసులు విచారణ జరుగుపుతున్నారు.
నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాల్లో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. లేక్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సాగర్ జలాల్లో యువతి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీంతో వారు వెంటనే డిఆర్ఎస్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి వద్ద ఎలాంటి వివరాలు లభించలేకపోవడంతో.. పోలీసులు ఆమె ఎవరనే విషయాన్ని కనుగొనే పనిలో పడ్డారు.
హుస్సేన్ సాగర్‌లో గుర్తుతెలియని యువతి మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా..? అన్న దానిపై పోలీసులు విచారణ జరుగుపుతున్నారు. మృతురాలి వయసు 25నుంచి 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. యువతి మృతదేహంపై క్రీం కలర్ టాప్, ఎరుపు రంగు ప్యాంటు ధరించి ఉందని పోలీసులు తెలిపారు. యువతి వివరాలు తెలిసినవారు, ఆమె సంబంధీకులు ఎవరైనా.. 040-27853595 9948031574 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.