నగరంలోని మందు బాబుకు షాక్ తగిలింది. రేపు గణేషు నిమజ్జనంలో భాగంగా నగరంలోని అన్ని మధ్యం దుకాణాలు రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు నగరంలోని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇక అంతరాష్ట్రాల నుంచి వచ్చే లారీలపై కూడా నిషేదం విధిస్తూ ట్యాంక్ బాండ్, సరూర్ నగర్ ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక నిఘాను పెంచి భద్రతను ఏర్పాటు చేశారు.
ఇక సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు నగరంలోని ట్రాఫిక్ ను పర్యవేక్షించటంతో పాటు కంట్రోల్ రూంను సైతం ఏర్పాటు చేశారు పోలీసులు . అంతే కాకుండా ట్యాంక్ బండ్ ప్రాంతంలో భారీ క్రేన్ ల సాయంతో గణనాధులను నిమజ్జనం చేసేందుక పోలీసులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. నగరంలోని ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన ప్రత్యేక భద్రతతో రంగంలోకి దిగారు పోలీసులు.