TSPSC పేపర్ లీకేజ్ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 12 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే తాజా రిమాండ్ రిపోర్ట్ మాత్రం సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
TSPSC పేపర్ లీకేజ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని గత కొన్ని రోజుల నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ పేపర్ లీకేజ్ ఘటనను ప్రస్తుతం సిట్ విచారిస్తుంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందుతులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రేణుక దంపతుల పాత్రే కీలకంగా ఉందని విచారణలో తేలింది. ఇకపోతే ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా సిట్ అధికారులు తెలిపారు.
అయితే తాజా రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల్లో నలుగురు TSPSC ఉద్యోగులు కాగ, మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులుగా కావడం విశేషం. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 19 మంది సాక్షులను విచారించినట్లుగా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇక TSPSC ఉద్యోగి శంకర్ లక్ష్మితో పాటు మరికొంతమందిని సాక్షులుగా పేరొన్నారు. కర్మన్ ఘట్ లోని ఓ లాడ్జ్ యజమాని సాక్షిగా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం జరిగినట్లుగా హోటల్ లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని సిట్ అధికారులు తెలిపారు. ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి సమాచారంతో షమీమ్, రమేష్, సురేష్ లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక అనంతరం ఆ ముగ్గురు నిందితుల నుంచి ల్యాప్ టాప్ లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.