నేటికాలంలో అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సామాన్య ప్రజలను వివిధ రకాల మాటలతో బురిడి కొట్టిస్తారు. తాజాగా ఇద్దరు మహిళలు పోలీసులు కస్టడిలో ఉన్నారు. అయితే వీరు చేసిన మోసం ఏమిటో తెలిస్తే మీరు షాకవుతారు.
నేటికాలంలో అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సామాన్య ప్రజలను వివిధ రకాల మాటలతో బురిడి కొట్టిస్తారు. అంతేకాక వారి నుంచి అందిన కాడికి సొమ్మును దొచుకుని ఉడాయిస్తుంటారు. తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని పేదలను నమ్మించి..భారీ మోసానికి పాల్పడ్డారు ఇద్దరు మహిళలు. 100 మందికిపై పేదల నుంచి కోటి రూపాయలకు పైగా డబ్బులు తీసుకుని పారిపోయారు. తాజాగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం పట్టణంలోని ఖిల్లాలో అంగన్ వాడిగా షేక్ షకీనా బేగం అనే మహిళ పని చేస్తుంది. అలానే పుట్టకోటలో రిసోర్స్ పర్సన్ గా విధులు బోలేపల్లి లక్ష్మి విధులు నిర్వహిస్తుంది. వీరిద్దరు కలసి చాలా మందిని మోసం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే పేదలను మోసం చేశారు. దీనిపై 2022 జూన్ లో పలు వివాదాలు చెలరేగాయి. చివరకు తాము మోసపోయామని పేదలు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు వారిని విధుల్లో నుంచి తొలగించారు. షకీనా, లక్ష్మీల కోసం ప్రత్యేకం బృందం ఏర్పడి గాలించింది.
విశ్వసనీయ సమాచారం మేరకు వారిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వారిని విచారించగా దాదాపు 100 మందికిపై గా పేదలను మోసం చేసి.. రూ. కోటికిపైగా తీసుకున్నట్లు గుర్తించామని, తమ వద్ద ఒక్క రూపాయి కూడా లేదని నిందితులు చెబుతున్నారని పోలీసులు వివరించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసి.. బాధితులు భారీగా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళన చేశారు. మరి.. ఇలా పేదలను మోసం చేస్తున్న వారికి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.