ఇటీవల దేశ వ్యాప్తంగా పటు చోట్ల వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. చిన్న, పెద్దా అనే వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా హార్ట్ స్టోక్ తో మరణిస్తున్నారు. మొన్నటి వరకు కనోనా భయం ఉంటే.. ఇప్పడు జనాలకు గుండెపోటు భయం పట్టుకుంది.
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలకు కంటిమీద కునుకు లేకండా చేసింది.. ఇప్పుడు కరోనాతో పాటు వరుస గుండెపోటు మరణాలు ప్రజల్లో భయబ్రాంతులను సృష్టిస్తున్నాయి. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండని యువత గుండెపోటు, హార్ట్ ఎటాక్, కార్డియా అటాక్ పేరు ఏదైనా అప్పటి వరకు మన కళ్ల ముందు ఆనందంగా గడిపిన వారు.. మనతో ముచ్చటించిన వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించే లోపు కన్నుమూస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్న కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా గుండెపోటుతో ఒకే రోజు ఇద్దరు కన్నుమూయడంతో గ్రామాల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ క్షణంలో ఎవరికి గుండెపోటు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మరణించడం ఆ గ్రామాల్లో విషాదం నింపింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం చీనూర్ సర్పంచ్ అయిన సౌందర్య భర్త లక్ష్మీ నారాయణ వయసు 33 ఏళ్లు.. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీ నారాయణ కన్నుమూశాడు. చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్ ఉన్న లక్ష్మీ నారాయణ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇక నాగిరెడ్డి పేటకు చెందిన మట్టపల్లి పోచయ్య వయసు 60 సంవత్సరాలు.. హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే మెదక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న పోచయ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు. బుధవారం ఒకే రోజు ఇద్దరు చనిపోవడంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు నిండుకున్నాయి. గుండెపోటుతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సరేందర్ పరామర్శించి అంత్యక్రియిల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల నాగిరెడ్డి పేట మండలంలో వరుస గుండెపోటు మరణాలు సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల క్రితమే.. లింగంపల్లి గ్రామ సర్పంచ్ మానవ.. మరో వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు.