ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో అక్కడ పదుల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు బలి అవుతున్నారు.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుసగా చోటు చేసుకుంటున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యవ సేవించి వాహనాలు నడపటం, అతి వేగం ఇలా ఎన్నో కారణాల వల్ల వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు ఎన్నిరకాల చర్యలు చేపట్టిన రోడ్డు ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జగిత్యాల నుంచి వరంగల్ వెళ్లున్న టీఎస్ ఆర్టీసీ బస్ ను ఓ లారీ రాంగ్ రూట్ లో వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్ కండక్టర్ బొల్లం సత్తయ్య అక్కడిక్కడే మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో సత్తయ్య కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఆర్టీసీ సిబ్బంది బొల్లం సత్తయ్య కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే భాదిత కుటుంబానికి టీఎస్ ఆర్టీసీ ఆసరగా నిలిచి.. రూ.50 లక్షల విరాళం అందజేసింది.
ప్రమాదంలో మరణించిన జగిత్యాల డిపో కండెక్టర్ బొల్లం సత్తయ్య కుటుంబానికి రూ.50 లక్షలకు సంబంధించి రెండు చెక్కులను యూబీఐ అధికారులతో కలిసి ఎండీ సజ్జనార్ మంగళవారం బస్ భవన్ లో అందించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని.. ప్రమాదాల్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ ఎప్పుడూ అండగా నిలుస్తుందని.. వారికి ఏ కష్టం రాకుండా చూస్తుందని అన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక ప్రయోజనం కోసం సూపర్ సాలరీ అకౌంట్స్ తెరిపించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కు ఖాతాను మార్చుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఎంప్లాయిస్ నిర్లక్ష్యం వహించవొద్దని అన్నారు. ఇక రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందించడంపై బొల్లం సత్తయ్య కుమారుడు, కూతురు కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు ప్రమాదంతో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండగా నిలిచింది. విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్… pic.twitter.com/kCyLmRXaKf
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) June 13, 2023