తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఇటీవల కాలంలో పలు వినుత్నన కార్యక్రమాలు చేపడుతూ ప్రయాణికులను ఆకర్షిస్తుంది. తాజాగా ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళకు TSRTC పలు నజరానాలు ప్రకటించింది. ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో మహిళా ప్రయాణికు శుభవార్త తెలిపింది ఆర్టీసీ. నగరంలో మహిళ ప్రయాణికుల కోసం రద్దీ సమయాలో 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు 8వ తేదీన ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
రాష్ట్రంలోని ముఖ్య బస్ స్టేషన్ల లో మహిళ వ్యాపారులకు మార్చి 31 వరకూ ఉచితంగా స్టాళ్లు కేటాయిస్తారు. ఆసక్తి కలిగిన మహిళలకు ఉచిత హెవీ వెహికల్ డ్రెవింగ్ శిక్షణను కూడా కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 డ్రైవింగ్ శిక్షణా సంస్థలో 30రోజుల పాటు భారీ వాహనాల డ్రైవింగ్ కు ఉచిత శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల వారు తప్పని సరిగా LMV, రెండేళ్ల అనుభవ కలిగిన వారు తమ పేర్లు డిపో వద్ద నమోదు చేసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24 టిక్కెట్ పై మార్చి8 నుంచి 14 వరకు 20% రాయితీ ఇస్తున్నారు. వరంగల్ లోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. గర్భిణీలకు, పాలిచ్చే తల్లుల కోసం ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రెండేసి సీట్లు కేటాయిస్తారు.
మార్చి 31 వరకూ మహిళ ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తారు. అలాగే విజేతలకు నెలరోజుల పాటు డిపో నుంచి 30 కిలోమీటర్ల పరిధి వరకు ఉచిత ప్రయాణం ఉంటుంది. టికెట్, ప్రయాణికురాలి ఫొటో 9440970000 నంబరుకు వాట్సాప్ లో పంపినా డ్రాలో ఎంపిక చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. అలాగే మహిళా ప్రయాణికుల ఫిర్యాదుల కోసం.. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన సమస్యలకు మహిళా దినోత్సవం రోజు నుంచి ప్రత్యేక మొబైల్ నంబర్ 9440970000ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. మరి.. మహిళల కోసం TSRTC ప్రకటించిన ఈ నజరానాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.