తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే.. గ్రూప్-1, యూనిఫామ్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. వాటి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ సైతం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీత భత్యాలు, ఎంపిక విధానం వంటి అంశాలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఎంపిక అయిన వారికి మూడేళ్ల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్లకు మించరాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈనెల 15 దరఖాస్తులకు చివరతేదీ.
అర్హతలు: ఏదైనా విభాగంలో బీఈ, బీటెక్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వేతనాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు మొదటి ఏడాది రూ.18,000.. రెండో ఏడాది రూ.20,000.. మూడో ఏడాది నుంచి రూ.22,000 చెల్లిస్తారు.
టెక్నిషియన్: డిప్లమా అప్రెంటిస్ పోస్టులకు మొదటి ఏడాది రూ.16,000.. రెండో ఏడాది రూ.17,500.. మూడో ఏడాది నుంచి రూ.19,000 చెల్లిస్తారు.
రీజియన్ల వారీగా ఖాళీలు:
టీఎస్ ఆర్టీసీ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఇలా దరఖాస్తు చేసుకోవాలి
మరిన్ని పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
TSRTC Recruitment 2022 Notification Out for 300 Graduate / Diploma Apprentice; Check How to Apply Online, Salary, Eligibility https://t.co/rdGl9MJtqZ
— Lmp News (@lmpnewsofficial) June 6, 2022