తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీసీ సజ్జనార్ ప్రయాణికులకు ఉపయోగపడే ఎన్నో స్కీమ్ లు అమలు చేస్తూ వస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ ప్రయాణికులకు ఉపయోగపడేవిధంగా ఎన్నో రకాల స్కీమ్స్ అమలు చేస్తూ ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడటమే కాదు.. ఆర్టీసీ కి మంచి ఆదాయం వచ్చే దిశగా ముందుకు సాగుతున్నారు. గతంలో ఎన్నో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రయాణికుల మరో శుభవార్త తెలిపింది టీఎస్ఆర్టీసీ. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్ ని అందుబాటులోకి తీసుకురానుంది. మొదట కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరుగుతున్న పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ లకు శ్రీకారం చుట్టనుంది. పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్ లను మంగళవారం, జులై 18 నుంచి అమలు చేయాలని సంస్థ నిర్ణయించినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఇతర ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్ లు ఎంతో ఉపయోగపడతాయని ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరిన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు.
ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ జిల్లాలో జనరల్ బస్‌పాస్ అందుబాటులో ఉండగా.. ప్రయాణికుల అభ్యర్థన మేరకు అదేతరహా పాస్ లను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయడానికి ‘పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్’లను ప్రవేశపెడుతున్నామని సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం ‘పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్’పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కాగా, ‘పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్’కి సంబంధించిన పూర్తి వివరాల కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను #TSRTC అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఇవాళ ఈ బస్ పాస్ పోస్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు.@TSRTCHQ @tsrtcmdoffice @SajjanarVC @CTMOTSRTC pic.twitter.com/do4v3ZcAjC
— PRO, TSRTC (@PROTSRTC) July 17, 2023