టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న ప్రయోగాలు చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకొని టీఎస్ఆర్టీసీ ని లాభాల బాటలో తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
పోలీస్ డిపార్ట్ మెంట్ లో తనదైన ముద్ర వేసిన సీపీ సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ కూడా తనదైన మార్క్ చాటుకుంటున్నారు. గతంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎస్ ఆర్టీసీలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందిస్తూ లాభాల బాటపట్టే విధంగా ముందుకు సాగుతున్నారు. పెళ్లిళ్లు, జాతర్లు, శుభకార్యాలకు రాయితీ కల్పిస్తూ ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ ప్రయాణీలకు సజ్జనార్ మరో శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే..
టీఎస్ ఆర్టీసీ ఎండిగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెరుగైన సౌకర్యాలు అందించడమే కాదు.. పలు రాయితీలు కల్పిస్తూ ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. అదే విధంగా భారీ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ప్రయాణికులను ఎప్పటికప్పుడు ఆకర్షించే క్రమంలో పలు ఆఫర్లు ప్రకటిస్తున్న ఆర్టీసీ తాజాగా ప్రజలకు ఆర్ధికభారం తగ్గించేందుకు హైదరాబాద్ – విజయవాడ రూట్ లో 10 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది. ఆ రూట్ లో నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసులో రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ నెల 30 వరకు 10 శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటుంది.
ఈ ఆఫర్ కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ డిస్కౌంట్ తో ఒక్కో ప్రయాణికుడికి రూ.40 నుంచి రూ.50 వరకు ఆదా అవుతుందని తెలుస్తుంది. రిజర్వేషన్ కోసం తమ అధికార వెబ్ సైట్. www.tsrtconline.com ను సంప్రదించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 23450033 ను సంప్రదించాలన్నారు. సాధారణంగా నిత్యం అత్యంత రద్దీగా ఉండే రూట్ ఏదంటే హైదరాబాద్ – విజయవాడ. ఈ రూట్లలో నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు తమ ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. ఈ డిస్కౌంట్ తో కాస్త మేలు జరుగుతుందని అంటున్నారు.
ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 10 శాతం రాయితీని #TSRTC కల్పిస్తోంది. ఆ మార్గంలో వెళ్లే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ నెల ౩౦ వరకు 10 శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటుంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.40 నుంచి 50 వరకు ఆదా… pic.twitter.com/017vjug8T0
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 13, 2023