తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ప్రయాణికుల ఆదరణ పొందడమే లక్ష్యంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీఎస్ ఆర్టీసీలో త్వరలోనే ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ట్విట్టర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసిన సజ్జనార్ … ఈ ఫొటో ఎక్కడిది? అంటూ ఓ పోల్ క్వశ్చన్ మాదిరిగా ట్వీట్ చేశారు. ఇప్పటికే మహిళల కోసం ఎన్నో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.
మహిళలు ఏ మాత్రం ఇబ్బంది పడకూడదని ఆర్టీసీ బస్సులపై అసభ్యకరంగా.. ఇబ్బందికరంగా కనిపించే ప్రకటనలు, పోస్టర్లను పూర్తిగా రద్దు చేశారు. ప్రకటనలు, పోస్టర్లు కనిపించకుండా బస్సులకు పెయింట్ వేయించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అందుకోసం సుమారు రూ.3 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు అంచనా. అయినప్పటికీ ప్రయాణికుల నమ్మకం, ఆదరణ పెంచుకునేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. అయితే సజ్జనార్ చేసిన ట్విట్ కు ఎంతో మంది స్పందిస్తున్నారు.
ప్రపంచ మహిళా దినోత్సవాన మహిళల కోసం.. ప్రత్యేకించి బాలికల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటిదేమైనా ప్రకటించనున్నారా? అంటూ ఓ నెటిజన్ అడిగారు. దీనికి సజ్జనార్ వెంటనే స్పందిస్తూ.. ఓ పథకాన్ని రూపొందిస్తున్నామని, త్వరలోనే ప్రకటిస్తామంటూ సమాధానం ఇచ్చారు. ప్రయాణీకుల కోసం సజ్జనార్ చేస్తూన్న వినూత్న ప్రయోగాలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Guess this place & #CaptionThis pic.twitter.com/3WT0YnFsBC
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 5, 2022