ఓ వైపు నిత్యావసర ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఆర్టీసీ రూపంలో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే పలు రకాల సేస్ పేరుతో చార్జీలు పెంచిన ఆర్టీసీ ఇప్పుడు మరోసారి సామాన్యులపై భారం మోపేందుకు రెడీ అవుతుంది. తెలంగాణ ఆర్టీసీ మరోసారి డీజిల్ సెస్ పెంచేసింది. ఇంధన ధరల పెరుగుదల ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. ఇందన ధరల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో విద్యార్థుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది.. చార్జీలు ఏకంగా రెండు రెట్లకు పైగా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గత రెండేళ్లుగా కరోనా ప్రభావం తెలంగాణలో బాగానే చూపించింది. ముఖ్యంగా కోవిడ్ ఎఫెక్ట్ విద్యార్థులపై బాగా పడింది. ఆన్ లైన్ క్లాసులు అంటే నానా అవస్థలు పడ్డ విద్యార్థులు ఇప్పుడిప్పుడే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ చార్జీలు పెంచడంతో చదువుకునే స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు రూ.165 చెలిస్తూ వస్తున్న విద్యార్థులు చార్జీలు పెరగడంతో ఏకంగా రూ.450 చెల్లించాల్సిన పరిస్థితి.. 8 కిలో మీటర్ల దూరానికి రూ.200గా ఉన్న ధరను రూ.600లకు పెంచింది. 12 కిలో మీటర్ల దూరానికి బస్ పాస్ ధరను రూ.245 నుంచి రూ.900లకు పెంచింది.
ఇది కూడా చదవండి: Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!
మొత్తానికి ఈ విద్యా సంవత్సరానాకి గాను తెలంగాణ ప్రభుత్వం ఒకంత స్టూడెంట్ కి షాక్ ఇచ్చినట్లే తెలుస్తుంది. ఓ వైపు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతూ సతమతమవుతున్న తల్లిదండ్రులకు ఇప్పుడు బస్ పాస్ చార్జీలు పెరగడంతో కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 10 నుంచి బస్ పాస్ లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారు. 15 నుంచి వెరిఫికేషన్ తర్వాత జారీ చయనున్నారు. అయితే కొత్త పాస్ లను కొత్త చార్జీల ప్రకారం జారీ చేయనున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.