ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూ, వారిని గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆధరించబడుతున్న టిఎస్ఆర్టీసి ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గే విధంగా నిర్ణయం తీసుకుంది.
ఏ రాష్ట్రంలోనైనా ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర వహించేది ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మాత్రమే. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రయాణికుల చేత ఆదరించబడుతుంది. కాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులు ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించే విధంగా ఆకర్షించేందుకు పలు సంస్కరణలు చేపట్టారు. టిఎస్ ఆర్టీసి ఎండి గా బాధ్యతలు చేపట్టిన విసి సజ్జనార్ సంస్థ మనుగడకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు, కార్మికుల సంక్షేమం కోసం పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసి బస్సుల్లో టి-24 టికెట్ ను ప్రవేశపెట్టి నగరంలో 24 గంటలు ప్రయాణించే విధంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్తూ మరో నిర్ణయం తీసుకున్నారు.
పండుగల సమయంలో ప్రయాణికులు వారి సొంతూళ్లకు వెళ్లడానికి ఎక్కువగా ఆర్టీసి బస్సులను ఆశ్రయిస్తుంటారు. పండుగలకు వెళ్లే వారితో ఆర్టీసి బస్సులు కిక్కిరిసి పోతుంటాయి. ప్రయాణికుల నుంచి ఇంతటి ఆధరణ వస్తుండడంతో తాజాగా టిఎస్ ఆర్టీసి ముందస్తు రిజర్వేషన్ చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కి.మీ లోపు రూ. 20గా, 350 నుంచి ఆపై కిలోమీటర్లకు రూ. 30గా చార్జీని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఎసి సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ. 30 చార్జ్ చేయనుంది. టిఎస్ఆర్టీసి తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కాస్త ఆర్థిక భారం తగ్గనుంది. ముందస్తు రిజర్వేషన్లకు మంచి స్పందన ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిఎస్ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండి సజ్జనార్ లు తెలిపారు. ఈ సదావకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.