ప్రజా రవాణాలో ఆర్టీసీ సంస్థ కీలకపాత్ర పోషిస్తుంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఉద్యోగస్థుల కు ఆర్టీసీ బస్సులు లేకపోతే చాలా కష్టం అవుతుంది. మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే నమ్ముతుంటారు. వాటిలో వారికి ప్రత్యేక సీట్లు మాత్రమే కాదు.. రక్షణ కూడా ఉంటుంది. ఇప్పుడు మహిళల కోసం టీఎస్ ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది.
ఏ రాష్ట్రం అయినా.. ప్రజా రవాణాలో ఆర్టీసీ కీలకపాత్ర పోషిస్తుంటుంది. ఎక్కడ చూసినా ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం చౌక మాత్రమే కాకుండా.. సురక్షితం కూడా. ముఖ్యంగా నగరాల్లో ఆర్టీసీ బస్సులు లేకపోతే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. రోజూ బస్సుల్లో ప్రయాణించే వారిలో మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఆర్టీసీ బస్సుల్లో వారికి ప్రత్యేక సీట్లను కేటాయిస్తుంటారు. పైగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, అప్పుడప్పుడు వారికి ఆఫర్లు కూడా ఇస్తుంటారు. తాజాగా మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది.
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పుడూ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్తలు చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే బస్సుల సంఖ్య పెంచడం, ప్రయాణికులు ఆర్టీసీనే తమ మొదటి ప్రయారిటీగా చేసుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో కూడా సజ్జనార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ మహిళల కోసం ఒక శుభవార్త తీసుకొచ్చారు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టీ24 టికెట్ ఉంటుందని అందరికీ తెలిసే ఉంటుంది. ఆ టికెట్ ధర మొన్నటి వరకు రూ.100గా ఉండేది. ఇటీవల దానిని సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్ సిటిజెన్స్ కోసం రూ.80కి తగ్గించారు.
ఇప్పుడు ఆ టికెట్ ధరను మహిళల కోసం మరో రూ.10 తగ్గించారు. మహిళలు ఇప్పుడు టీ24 టికెట్ ని రూ.80కే కొనుగోలు చేయచ్చు. ఈ టికెట్ తో మీరు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణం చేయచ్చు. మహిళా ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. ఇటీవల రూ.100 నుంచి రూ.90 తగ్గించినప్పుడే ఆర్టీసీ నిర్ణయాన్ని ప్రయాణికులు ప్రశంసించారు. ఇప్పుడు మహిళల కోసం మరో రూ.10 తగ్గించడంపై టీఎస్ ఆర్టీసీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మహిళలకు #TSRTC శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టి-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు… pic.twitter.com/swXIp035Xz
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 8, 2023