టీఎస్‌ఆర్‌టీసీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బస్సు శంషాబాద్ నుంచి జూబ్లీ బస్టాండ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
టీఎస్‌ఆర్‌టీసీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బస్సు శంషాబాద్ నుంచి జూబ్లీ బస్టాండ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్ నుండి పొగలు రావడాన్ని ముందే గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అంటుకున్న విషయం డ్రైవర్ వెంటనే ప్రయాణికులకు చెప్పడంతో వారంతా క్షేమంగా కిందకు దిగిపోయారు. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
హైదరాబాద్ నగర రోడ్లు నిత్యం ఎంత రద్దీగా ఉంటాయో అందరికీ విదితమే. బయటకొచ్చి పొరపాటున ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే తిరిగి ఏ సమయానికి ఇంటికెళతామో తెలియని పరిస్థితి. అలాంటిది నడిరోడ్డుపై బస్సు కాలిపోతుంటే జనాలు ఊరుకుంటారా..! ఎక్కడి బైకులు, కార్లు ఆపేసి మరీ దాని వంక చూశారు. దీంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు అంటుకుని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, తెలంగాణ ఆర్టీసీ నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ బస్సులను నడిపేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.