తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజు రోజుకీ కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మంది నింధితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది.
తెలంగాణాలో పెను సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం కేసులో ఒక్కక్కరిపై వేటు పడుతుంది. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు విషయంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు తొమ్మిది మందిని తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితులు రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రేణుక వనపర్తి జిల్లా బుద్దారంలో బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంది. కాగా, ఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రేణుక కీలక పాత్ర ఉందని గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ రోనాల్డ్ రాస్ కి నివేధిక పంపించారు పాఠశాల ప్రిన్సిపాల్. ఈ నివేధిక ఆధారంగా రేణుకను ఉద్యోగం నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అలాగే రేణుక భర్త అయిన ఢాక్యా నాయక్ ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీఓ లో ఉపాధి హామీ లో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ డీఆర్డీఏ పీడీ కృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం కేసులో రేణుక ఆమె భర్త ఢాక్యా నాయక్ పై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి పంపించారు. ప్రస్తుతం ఢాక్యా నాయకర్ జైల్లో ఉండటం చేత ఉత్తర్వులు ఆయనకు అందిచే వీలు లేకపోవడంతో పంచాంగల్ తండాలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు వాటిని అందజేశారు. ఇక ఈ కేసులో మరో ప్రధాన నింధితులు రాజశేఖర్, ప్రవీణ్ లు ఎవరెవరికి పేపర్లు అమ్మారు.. ఎంత డబ్బు వసూలు చేశారు అన్న విషయంపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.