టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ మొబైల్ లో వందల సంఖ్యలో మహిళల ఫోన్ నెంబర్లు గుర్తించారు పోలీసులు. అతని వాట్సప్ చాటింగ్‌లలో మహిళల నగ్న ఫోటోలు, వీడియోలను ఆశ్చర్యపోయారు. ఇంతమంది మహిళల ఫోన్ నెంబర్లు అతడి మొబైల్ లో ఎందుకున్నాయి..? మహిళలు నగ్న ఫోటోలు, వీడియోలు అతడికి ఎందుకు పంపారు..? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
టీఎస్‌పీఎస్‌సీ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల దర్యాప్తులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తోన్న ప్రవీణ్ మొబైల్‌లో వందల సంఖ్యలో మహిళల ఫోన్ నెంబర్లు గుర్తించారు పోలీసులు. అంతేకాకుండా.. ఆ వాట్సప్ చాటింలలో మహిళల నగ్న ఫోటోలు, వీడియోలను సైతం గుర్తించారు. ఇదిలావుంటే, ప్రవీణ్ గ్రూప్ -1 పరీక్ష రాయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీక్ అయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2017లో జూనియర్ అసిస్టెంట్‌గా టీఎస్‌పీఎస్‌సీలో విధుల్లోకి చేరిన ప్రవీణ్, నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్‌లో పనిచేశాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్ సెక్షన్‌కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకొని.. దరఖాస్తు సందర్భంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించి వారితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతడు పలువురు మహిళలతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి మొబైల్ లో వందల సంఖ్యలో మహిళల ఫోన్ నెంబర్లు గుర్తించిన పోలీసులు, అతడి వాట్సాప్ చాట్ లోని నగ్న ఫోటోలు, వీడియోలు చూసి విస్తుపోయారు.
కాగా.. ఏడాది క్రితం టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వెళ్లిన ప్రవీణ్.. ఉన్నతాధికారుల వద్ద ఎంతో క్రమశిక్షణతో మెలిగేవాడని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అయితే, ప్రవీణ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాయడం ఈ కేసులో కీలక మలుపు. అతడు ఆన్సర్ షీట్ లో రాంగ్ బబులింగ్ తో డిస్ క్వాలిఫై అయినా, ఆన్సర్ కీతో చెక్ చేసుకుంటే అతడికి ప్రిలిమ్స్‌లో 103 మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రూప్ -1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీక్ అయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2017 నుంచి ఈ కార్యాలయం లో పని చేస్తున్న ప్రవీణ్ ఇప్పటి వరకు ఎన్ని పరీక్షల పేపర్ల ను లీక్ చేశాడనే అంశంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ విచారణలో వాస్తవాలు బయటకొస్తాయయని చెప్తున్నారు. కాగా, ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే లీకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.