టీఎస్‌పీఎస్పీ పేపర్ లీక్ కేసులో.. లోతుగా దర్యాప్తు చేస్తోన్న కొద్ది.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పల్లీ బఠాణీల మాదిరి.. ప్రతిష్టాత్మక పరీక్ష పేపర్లను అమ్మకానికి పెట్టారు నిందితులు. ఇక తాజాగా ఈ కేసులో ఆసక్తికర ప్రేమా కథా చిత్రమ్ వెలుగు చేసింది. ఆ వివరాలు..
పేపర్ లీక్ కేసులతో తెలంగాణ అట్టుడుకుతోంది. సామాన్యులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు.. భవిష్యత్తు గురించి భయపడుతుంటే.. రాజకీయ నేతుల ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌తో ప్రారంభమైన వివాదం.. తాజాగా పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ వరకు సాగింది. ఈ అంశం తెలంగాణలో బర్నింగ్ టాపిక్ అయ్యింది. ఇక టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తవ్వతున్న కొద్ది.. కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్-1 సహా మిగతా పరీక్షా పత్రాలను.. రోడ్డు మీట పల్లీలు అమ్మినట్లు.. అమ్మకానికి పెట్టారు కొందరు వ్యక్తులు. ప్రశ్నాపత్రాలు ఒకరి చేతి నుంచి మరొకరికి మారుతూ.. లక్షల కొద్ది డబ్బు చేతులు మారుతూ.. రాష్ట్రం అంతా తిరగడమే కాక ఏకంగా విదేశాలకు కూడా చేరుకుంది. ఫారిన్ కంట్రీల్లో ఉన్న వారు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కొని.. ఇక్కడకు వచ్చి పరీక్ష రాశారంటే.. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం అవుతుంది. ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఓ ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్తగా లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముమ్మర విచారణ సాగిస్తోన్న సిట్ అధికారులు.. ఓ ప్రేమ జంటను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 15 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులు ఏ ఏ పరీక్షా పేపర్లను.. ఎవరెవరికి.. ఎంత మొత్తానికి అమ్మారన్న విషయాలపై లోతుగా ఆరా తీస్తుండగా.. సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఇప్పటికే.. కేసులో ప్రధాన నిందితురాలైన రేణుక భర్త.. డాక్యా నాయక్.. ఏఈ పేపర్‌ను ఏకంగా 25 లక్షలకు అమ్మినట్టు అధికారులు గుర్తించారు. ఆ పేపర్ కొనడం కోసం పలువురు అభ్యర్థులు.. పొలం, బంగారం అమ్మేసి డబ్బులు చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఇక తాజాగా వెలుగు చూసిన లవ్ స్టోరీలో.. ప్రియురాలి కోసం.. ప్రియుడు.. ఏకంగా ఆరు లక్షల రూపాయలు చెల్లించి.. డీఏఓ పేపర్‌ను ప్రవీణ్ దగ్గర కొనుగోలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. సదరు లవర్.. ముందుగా 6 లక్షల రూపాయలు చెల్లించి పేపర్ కొనుగోలు చేశాడు. ఫలితాల తర్వాత మిగతా మొత్తం ఇస్తానని వెల్లడించాడు. అయితే… ఫిబ్రవరి 26న జరిగిన డీఏఓ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక పోలీసులకు చేరింది. పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, డాక్యా నాయక్ నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్లను సిట్ అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. మొబైల్ ఫోన్లతో పాటు ప్రవీణ్, రాజశేఖర్ వాడుతున్న ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ను కూడా అధికారులు ల్యాబ్‌కు పంపించారు. ఇందుకు సంబంధించిన నివేదిక రాగానే.. ఈ నెల 11న సిట్ అధికారులు దాన్ని.. కోర్టుకు సమర్పించనున్నారు. దాంతో.. ఈ పేపర్ లీక్ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది.
ఇప్పటికే సిట్ అధికారులు.. పేపర్ లీక్ కేసుకు సంబంధించి 90 శాతం విచారణను పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కూడా రావటంతో.. ఆ రిపోర్టును కోర్టుకు సమర్పించనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ కేసులో సుమారు 150 మందిని అధికారులు విచారించినట్టు అధికారులు వెల్లడించారు. మరి ఈ పేపర్ లీక్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.