తెలంగాణలో పేపర్ లీక్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈకేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. ఆ వివరాలు..
తెలంగాణలో పేపర్ లీక్ కేసు ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంగట్లో దొరికే సరుకులాగా.. ప్రతీష్టాత్మకమైన పోటీ పరీక్షల పేపర్లను అమ్మకానికి పెట్టారు.. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో పని చేస్తోన్న కొందరు సిబ్బంది. వీరి వల్ల.. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడింది. ఏళ్లుగా ఇంటికి దూరంగా సిటీలో ఉండి.. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతున్న నిరుద్యోగులు.. తాజా పరిణామాలతో.. తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక.. ఇంటి బాట పట్టారు. పేపర్ లీక్ కేసును.. సిట్ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కుమారు మొత్తం.. 15 పేపర్లు లీక్ చేసినట్లు తెలిసిందే. ఈ కేసులో సిట్ అధికారులు పలువురుని అరెస్ట్ చేశారు. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది.
ఇక తాజాగా పేపర్ లీక్ కేసులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో భాగంగా పోలీసులు ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సుస్మిత, సాయి లౌకిక్‌లను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పేపర్ లీక్ గురించి వెలుగులోకి రావడంతో.. తమకు ఎలాంటి సమస్య రాకుండా చూడమని.. ఈ జంట పుణ్య క్షేత్రాలు తిరగం ప్రారంభించింది అంట. అసలు వీరు ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే.. ఖమ్మంకు చెందిన కార్ల వ్యాపారి అయిన లౌకిక్ భార్య సుస్మిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలయ్యాక.. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి.. పరీక్షకు ప్రిపేర్ అయ్యింది.
2022, అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసింది. అయితే ఓఎంఆర్‌లో రాంగ్ బబ్లింగ్ అనగా.. ఒకే కాలమ్‌లో రెండు చోట్ల మార్కింగ్ చేయడంతో ఆమె రిజల్ట్‌ని హోల్డ్‌లో ఉంచారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం సుస్మిత.. పలుమార్లు.. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వచ్చి వెళ్లేది. ఈ క్రమంలోనే ఆమెకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద పీఏగా పని చేస్తోన్న పేపర్ లీక్ కేసు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే ప్రశ్నా పత్రాల విక్రయాలు ప్రారంభించిన ప్రవీణ్‌కు సుస్మిత.. డీఏఓ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దాంతో తన దగ్గర ప్రశ్నాపత్రం ఉందని.. సుస్మితకు తెలిపాడు ప్రవీణ్.
ఈ విషయం గురించి భర్తకు తెలిపింది సుస్మిత. భార్యాభర్తలిద్దరూ కలిసి పరీక్షా పత్రం కొనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. 6 లక్షల రూపాయలు ముందుగా చెల్లించే ఒప్పందం ప్రకారం.. ఫిబ్రవరి 23న ప్రవీణ్ వద్ద నుంచి డీఏఓ మాస్టర్ పేపర్ కొనుగోలు చేశాడు లౌకిక్. రెండు రోజుల్లో పేపర్‌కు ప్రిపేర్ అయిన సుస్మిత.. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పరీక్ష రాసింది. పేపర్ తనకు ముందే లీక్ కావడంతో.. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు మార్క్ చేసింది సుస్మిత. గ్రూప్-1 పరీక్ష ఫలితాలను వదిలేసింది. డీఏఓ ఉద్యోగం వస్తుంది అనే ధీమాతో ఉంది.
ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంతో.. మార్చి 11 వరకు కూడా సంతోషంగా గడిపారు భార్యాభర్తలు. అయితే మార్చి 12న పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. భార్యాభర్తలిద్దరికి భయం పట్టుకుంది. ఈలోపు ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఇతర నిందితులను అరెస్ట్ చేయడంతో.. లౌకిక్ దంపతులు ఆందోళనకు గురయ్యారు. డీఏఓ పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు రాకూడదని.. తాము ఈ కేసులో ఇరుక్కోకూడదని దేవుళ్లను వేడుకోవడం ప్రారంభించారు. భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఒత్తిడి భరించలేక.. తిరుపతి, షిర్డీ సహా అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. అయితే ప్రవీణ్ అకౌంట్‌కు.. లౌకిక్.. 6 లక్షలు ట్రాన్సఫర్ చేసిన క్లూ ఆధారంగా విచారణ చేపడితే.. లౌకిక్ దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.