పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యవసర భేటీ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఏఈ పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని అంది.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి ఓ కొత్త అప్‌డేట్ వచ్చింది. ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ఇక, గవర్నమెంట్ విభాగాలకు సంబంధించిన మొత్తం 837 అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ)పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన జరిగిన ఈ పరీక్షకు దాదాపు 74 వేలం మంది దరఖాస్తు చేసుకున్నారు. 55 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. క్వశ్చన్ పేపర్ లీక్ కావటంతో అధికారులు ఏఈ పరీక్షను రద్దు చేశారు. కాగా, మార్చి12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది.
లీకేజీపై సర్వీస్ కమిషన్ చైర్మన్ జానర్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దురదృష్టకరమైన వాతావరణంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చాక దాదాపు 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రస్తుతం 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్‌సీ ఎన్నో కొత్త విధానాలు తెచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను మల్టిపుల్ జంబ్లింగ్ చేశాం. ఎట్టి పరిస్ధితుల్లోనూ అక్రమాలు జరగొద్దనే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ, నమ్మిన మనుషులే మోసం చేశారు’’ అని అన్నారు.