గ్రూప్-2 అభ్యర్థులకు అలెర్ట్.. గ్రూప్-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఖారారు చేసింది. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అంశాలను పరిగణలోకి టీఎస్‌పీఎస్సీ పరీక్ష తేదీలను ప్రకటించింది.
మీరు గ్రూప్-2 ఉద్యోగాలకు అప్లై చేశారా! అయితే, మీకోసమే ఈ వార్త. గ్రూప్-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఖారారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
మొత్తం 783 ఖాళీలుండగా, ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ పడనున్నారు. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అంశాలను పరిగణలోకి టీఎస్‌పీఎస్సీ పరీక్ష తేదీలను ప్రకటించింది. కాగా, గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-4 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ఖరారు చేసిన విషయ తెలిసిందే. జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనుండగా, జులై 1న గ్రూప్-4 పరీక్షలు జరగనున్నాయి.
#TSPSC Group 2 exam will be conducted on August 29 and 30. pic.twitter.com/rnXCEN33F5
— సందీప్ ఎరుకల Sandeep Erukala (@Esandeep97) February 28, 2023