ఉదయం లేచిన మొదలు.. పడుకునే వరకు కరెంట్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కాలంలో నిత్యావసర సరుకుల ధరలు
ఇటీవల దేశంలో నిత్యాసర సరుకుల ధరలు చుక్కలనుంటుతున్నాయి. ఇంధన ధరల గురించి చెప్పాల్సిన పనేలేదు.. దానికి తోడు ఇప్పుడు కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు సామాన్యుడికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవల కరెంట్ చార్జీలు పెరిగిపోవడంతో సామాన్యుడు పరిస్థితి దారుణంగా మారింది. ప్రతి సంవత్సరం గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీలు పెరగడంతో సామాన్యులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. తాజాగా విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. తెలంగాణ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్ ఆదయా వ్యయాల ప్రతిపాదనను ఈఆర్సీ ఆమోదించింది. విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వారికి భారం లేకుండా ఈఆర్సీ నిర్ణయించామని.. కస్టమర్ ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పెరుగుతున్న ధరలు సామాన్యులకు ఎంత ఇబ్బందిగా మారిందో అర్థమవుతుందని.. తెలంగాణ ప్రజలకు మేలు చేసే యోచనలో విద్యుత్ సంస్థ ఉందని.. ఈ నేపథ్యంలో కస్టమర్ ఛార్జీలలో మార్పు లేదని.. డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని.. సబ్సిడీ, ఇరిగేషన్ లతో పాలు పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సబ్సిడీని డిస్కలకు ఎలాంటి భారం పడకుండా ఐదేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని.. దీంతో విద్యుత్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలుగుతుంది’ అని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం డిస్కమ్ లకు రూ.12,718.40 కోట్లు ట్రూ-ఆఫ్ చార్జీలు చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నామని.. ఈ మేరకు విద్యుత్ నియంత్ర మండలి ఆమోదించబడిందని.. ట్రూ-ఆఫ్ చార్జీలు గత పదిహేను సంవత్సరాలగు పెండింగ్ లో ఉన్నాయని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు తెలిపారు. ఇదిలా ఉంటే.. గత ఏడాది విద్యుత్ చార్జీలు 19 శాతం పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా 14 శాతం పెంచేందుకు కమీషన్ ఒప్పుకుంది. దీంతో గృహ విద్యుత్ వినియోగదారులకు యూనిట్ చార్జీ 40 పైసంల నుంచి 50 పైసల వరకు పెరిగింది. ఇక డొమెస్టిక్ వినియోగదారులకు కొత్తగా ఫిక్స్ డ్, కస్టమర్ చార్జీలు విధించిన విషయం తెలిసిందే. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా చార్జీలు పెంచుతారేమో అని భయపడుతున్న సమయంలో ఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకోవడం వినియోగదారులకు కొంత భారం తగ్గినట్టే అంటున్నారు.