ఈ సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థమై నాలుగు వేల బస్సులను, షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా నడిపించిందని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు 4 వేల బస్సులను అదనంగా నడిపించింది, దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా.. ప్రజా సేవయే లక్ష్యంగా వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం జరిగిందని అన్నారు.
ఇది చదవండి : కరోనాతో భర్త మృతి.. మంచితనం చాటుకున్న భార్య!
ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు కల్పించిన రవాణా సౌకర్యాల ద్వారా సంస్థకి రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు టీఎస్ ఆర్టీసీని ఆదరించడం పట్ల టిఎస్ఆర్టీసీ యజమాన్యం తరపున ప్రయాణీకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇక ముందు కూడా ఇలాంటి సౌకర్యాటు తెలంగాణ ప్రజలకు కల్పిస్తామని.. ఇదే విధంగా టీఎస్ఆర్టీసీని అదరిస్తూ సంస్థ అభివృద్దికి చేయూతనివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#సంక్రాంతి సందర్భంగా #TSRTC ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు 4 వేల బస్సులను అదనంగా నడిపించింది,దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా ప్రజా సేవయే లక్ష్యంగా వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం జరిగింది #TSRTCThankPassengers@TV9Telugu pic.twitter.com/GVZTu7vLlD
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 18, 2022