ప్రజలను సుదూర గమ్యాలకు చేర్చడంలో TSRTC కీలక పాత్ర పోషిస్తోంది. ఇక వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక.. సరికొత్త ఆలోచనలతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సజ్జనార్. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా రవాణపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నారు సజ్జనార్. అందులో భాగంగానే టీఎస్ ఆర్టీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైద్రాబాద్ నగర శివార్లలోని కాలేజీలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు భారీ ఊరటను కలిగిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్ ఆర్టీసీ.. మరిన్ని వివరాల్లోకి వెళితే..
హైద్రాబాద్ మహా నగరానికి ఎంతో మంది విద్యార్థులు చదువుకోడానికి వస్తుంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలేజీలు నగరానికి శివార్లలో ఉన్నాయి. పైగా కేవలం గ్రేటర్ హైద్రాబాద్ బస్సుల్లోనే బస్ పాస్ లకు అనుమతి ఉంది. అదీ కాక బస్సు తక్కువ సంఖ్యలో ఉండటంతో తరచుగా విద్యార్థలు ఫుట్ బోర్డు పై వేలాడుతూ.. ప్రమాదకరంగా ప్రయాణాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయాల్లో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులను సైతం మనం చూశాం.
ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలని టీఎస్ ఆర్టీసీ ఒక నిర్ణయానికి వచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు టీఎస్ ఆర్టీసీ సిటీ బస్ పాస్ ఉన్న విద్యార్థలు ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ.. ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ ఇక నుంచి విద్యార్థులు తమ బస్ పాస్ చూయించి ప్రయాణించ వచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విద్యార్థులకు సూచించాడు. విద్యార్థుల బాధను గుర్తించి.. ఈ నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాస్ తో ఇక నుంచి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించడానికి అనుమతి. విద్యార్థుల రద్దీ దృష్ట్యా #TSRTC యాజమాన్యం నిర్ణయం. ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోగలరు. pic.twitter.com/TWrWLbe2sV
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) November 23, 2022