ఇటీవల కొంతకాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గతంలో హారీష్ రావు ఏపీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాటలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి .. ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు.
ఇటీవల కొంతకాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గతంలో హారీష్ రావు ఏపీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాటలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అప్పలరాజు అయితే ఒక అడుగు ముందు కేసి.. కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఇలా తరచూ ఇరు రాష్ట్రాల మంత్రులు, నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా మరోసారి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు.
కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కేటగిరీలో కార్మికులకు అవార్డుల ప్రధానం చేశారు. ఈ వేడుకలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు, అలానే కార్మికలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఫలాల గురించి వివరించారు. ఇదే సందర్భంలో ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కమ్మ, కాపు, రెడ్డి అంటూ కుల రాజకీయాలు చేస్తున్నారని, జనాలను పట్టించుకోవడం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ పవర్ ఎంటో అందరికీ తెలుసునని మంత్రి అన్నారు. పోలవరం కట్టేది.. విశాఖ ఉక్కును కాపాడేది సీఎం కేసీఆరేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..” పక్క రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను తిడుతున్నారు. వారికి కార్మికుల ఉసురు తగులుతుంది. కేసీఆర్ స్ఫూర్తి తోనే కార్మికులు కాళేశ్వరం, యాదాద్రి, అంబేద్కర్, సచివాలయాన్ని కట్టారు. హైదరాబాద్ లో కార్మికులకు మంచి రోజులు వస్తాయి” అని మల్లారెడ్డి అన్నారు. మరి.. ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.