అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఇంటికి రావాల్సిన పంట వర్షం నీటి పాలైంది. ఆరుగాలం శ్రమించిన రైతన్న కష్టం వృథా అయ్యింది. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ అన్నదాతలకు శుభవార్త చెప్పాడు. ఆ వివరాలు..
ఏడాదంతా కష్టపడి పండించిన పంటను అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. అన్నదాతలు పంటను పండించడానికి ఎంత కష్టపడతారో.. చేతికొచ్చిన పంటను కాపాడుకొని అమ్ముకోవడానికి అంతకు రెట్టింపు బాధ పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అకాల వర్షాలు రైతన్నను నట్టేట ముంచాయి. వర్షం కారణంగా చేతికందిన పంట చేజారిపోయిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వేల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే.. పండిన పంట ఇంటికి చేరకుండానే వానపాలైంది. అమ్మకం కోసం మార్కెట్‌కి తీసుకెళ్లిన పంటలు కూడా.. వడగళ్ల వానకు తడిసి మొలకలెత్తాయి. ఆరుగాలం శ్రమ వాన పాలైందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకొంటున్నారు అన్నదాతలు. ఈ క్రమంలో రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకొంటున్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన అన్నదాతలకు ఎకరానికి రూ.10వేలు సాయం అందచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 12 నుంచి రైతులకు రూ.10వేలు సాయం పంపిణీ చేయనుంది. గత నెల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. నష్టపోయిన పంటలను స్వయంగా పరిశీలించారు. అకాల వర్షాలతో పంట నష్టోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీఎం ప్రకటన నేపథ్యంలో ఈనెల 12 తేదీ నుంచి రైతులకు చెక్కులను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం గాను అధికారులు పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. ప్రభుత్వానికి అందించారు. మరి పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించనున్న విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.